Saturday, October 19, 2019
Follow Us on :

ఘోరం..! చిన్నారిని చంపిన మేనత్త ఆ తర్వాత ఏం చేసిందంటే..!?

By BhaaratToday | Published On Feb 12th, 2019

విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకుంది. పెద బయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ల బాలిక కొర్ర అనితను మేనత్త దారుణంగా హతమార్చింది. చిన్నారిని నరికి చంపి రక్తాన్ని కూడా తాగిందని గ్రామస్థులు పేర్కొన్నారు.  నిందితురాలు లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో గత నెల రోజుల నుంచి తమ్ముడి ఇంట్లో ఉంటోంది. నాలుగు రోజుల కిందట తమ్ముడి భార్య ఆమెను ఇంటికి వెళ్లాలని చెప్పింది. దీంతో రస్మో ఆగ్రహించి పాపను చంపుతానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కట్టెల కోసమని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లి కత్తితో బలంగా మెడపై మోదడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు సమాచారం తెలుసుకొని వెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. దీంతో నిందితురాలిని గ్రామస్థులు పట్టుకొని చెట్టుకు కట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.