Tuesday, September 24, 2019
Follow Us on :

రాహుల్ గాంధీ ఎక్కడ.. సంతకం చేయడం మరచిపోయారట

By BhaaratToday | Published On Jun 17th, 2019

పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సెక్రెటేరియట్ అధికారి రాహుల్ గాంధీ అని పేరు ప్రకటించగానే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీలు బల్లలు చరిచారు. ఆంగ్లంలో తన ప్రమాణాన్ని చదివిన రాహుల్... రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తి కాగానే అక్కడి రిజిస్టర్‌లో సంతకం చేయకుండానే రాహుల్‌ వెనుదిరిగారు. దీంతో సెక్రెటేరియట్ అధికారులు రిజిస్టర్ చూయించి మరీ రాహుల్ గాంధీతో సంతకం చేయించారు. 

Image result for rahul gandhi
అయితే రాహుల్ గాంధీ ఈరోజు చాలా సేపటి వరకూ లోక్ సభలో కనిపించకపోవడంతో గుస గుసలు మొదలయ్యాయి. సభలో నరేంద్ర మోడీ ప్రమాణం చేసే సమయంలో సభ్యులు మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ కనిపించలేదు. అలాగే రాహుల్ ను ఓడించిన స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా రాహుల్ గాంధీ కనిపించలేదు. దీంతో రాహుల్ ఎక్కడ అంటూ సభలో గుస గుసలు మొదలయ్యాయి. తనకు కేటాయించిన సీట్లో రాహుల్ కనిపించకపోవడంతో ఎక్కడ అని ప్రశ్నలు వచ్చాయి.. అయితే కొద్ది సేపటికి రాహుల్ సభలో కనిపించారు.