Tuesday, October 15, 2019
Follow Us on :

నాగార్జున ఫామ్ హౌస్ లో డెడ్ బాడీ.. ఎవరిదో..?

By BhaaratToday | Published On Sep 19th, 2019

టాలీవుడ్ హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం సంచలమైంది. హైదరాబాద్ శివార్లలోని పాపిరెడ్డిగూడలో నాగార్జునకు 40 ఎకరాల స్థలం ఉంది. ఈ భూమిలోని ఓ పాడుబడిన గదిలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తి ఎవరా అన్న విషయాన్ని ఆరాతీసే పనిలో పోలీసులు ఉన్నారు. 

ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.