Saturday, August 24, 2019
Follow Us on :

టీడీపీ కి గుడ్‌బై చెప్ప‌నున్న ‘నామ’ !

By BhaaratToday | Published On Mar 15th, 2019

టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్‌ నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ఈ విషయం వాస్తవమేనని నామ నాగేశ్వరరావు గురువారం మీడియాకు తెలిపారు. ఇక, ఏపీ రాజధాని అమరావతిలో గురువారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే, నామ రెండు రోజుల కిందట పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వెళ్లారని టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ చెప్పారు.