Tuesday, October 15, 2019
Follow Us on :

వ్యాపారులకు బాసటగా ఎగ్జిబిషన్ సొసైటీ సంచలన నిర్ణయం..!

By BhaaratToday | Published On Jan 31st, 2019

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సమావేశమైన కమిటీ బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది. అయితే అగ్ని ప్రమాదంలో దాదాపు
300 స్టాళ్లల్లోని సరుకులు బూడిదయ్యాయి. దీంతో వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఎగ్జిబిషన్ సొసైటికి కట్టిన ఫీజును కూడా నష్టపోయిన వ్యాపారులకు తిరిగి ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఇక
ఎగ్జిబిషన్ మరో 15 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. ఆ 15 రోజుల్లో వచ్చిన టికెట్ల డబ్బులను నష్టపోయిన వ్యాపారులకు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇక అగ్ని ప్రమాదం తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్
గ్రౌండ్ లో కాలిపోయిన వస్తువులను తొలగింపుల పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ ను రెండు రోజులు పాటు మూసి వేసి ఆదివారం రోజు తెరవనున్నారు.