Friday, July 19, 2019
Follow Us on :

వైసీపీ, జనసేన గుర్తులపై కామెంట్స్ చేసిన బాలయ్య.. గ్లాస్ బార్ కు పోవాలంటూ

By BhaaratToday | Published On Mar 31st, 2019

నందమూరి బాలకృష్ణ హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోసారి కూడా తనను హిందూపురం ప్రజలు ఆదరిస్తారని బాలయ్య బాబు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన విలేకరులకు వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన బాలయ్య ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. లేపాక్షి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాలయ్య మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటూ మోడీకి వేసినట్లేనని అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఇక తమ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన గుర్తులపై ఆయన కామెంట్స్ చేశారు. ఎన్నికల తరువాత ఫ్యాన్ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుందని, గ్లాస్ బార్ కు పోతుందని, అసెంబ్లీకి వెళ్లేది సైకిల్ మాత్రమేనని బాలకృష్ణ అన్నారు. టీడీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని చెరువులకు నీరిచ్చామని, ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరైనాయని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలతో పోలిస్తే, మరిన్ని అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.