Sunday, August 25, 2019
Follow Us on :

అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డ బాలయ్య, రోజా..!

By BhaaratToday | Published On Jun 17th, 2019

వివిధ పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో తిట్టుకోవడం మనం చూసే ఉంటాం. అది ఎంతగా అంటే నిజ జీవితాల్లో ఎదురుపడినా కూడా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే ఎంతగానో ఆలోచిస్తారు. ఇక రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు చేసుకునే ఆరోపణలు ఒకటీ.. రెండూ కాదు..! ఎన్నో ఉంటాయి.. అయితే ఎన్నికలు అయ్యాక వారు అన్నీ మరచి కలిసిపోతారు. ఎలా అంటే ఎన్నికల ముందు రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి చేయని ఆరోపణలు అంటూ లేవు.. కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వాళ్ళు.. వాళ్ళు బాగానే ఉంటారు కానీ అభిమానులే దాన్ని మరీ సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకురాలు రోజా.. తెలుగుదేశం పార్టీ గురించి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.. అయితే ఎన్నికలయ్యాక ఆమె ఆ పార్టీ నాయకులతో ఎంతో హుందాగా నడుచుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆమె పలువురు తెలుగుదేశం నాయకులతో మాట్లాడారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆమె ఎదురుపడ్డారు. ఏపీ అసెంబ్లీ లాబీలో నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా  ‘బాగున్నారా’ అంటూ పరస్పరం పలకరించుకున్నారు. వీరిద్దరూ గతంలో పలు సినిమాల్లో కలిసి నటించారు కూడానూ..!