Thursday, October 17, 2019
Follow Us on :

ఒకే ఒక్కడు.. నందమూరి బాలకృష్ణ విజయం.. ఆధిక్యమెంతంటే..!

By BhaaratToday | Published On May 23rd, 2019

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది. అది కూడా నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం. హిందూపురం శాసనసభ స్థానం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. 17వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్‌పై గెలుపొందారు. 

నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి హిందూపురం కంచుకోటగా ఉంది. రామారావు తర్వాత హిందూపురం నుంచి హరికృష్ణ గెలుపొందారు. ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా బాలకృష్ణను హిందూపురం ప్రజలు గెలిపించడం విశేషం.