Thursday, April 25, 2019
Follow Us on :

రెండ్రోజులు ముందే ఓటు వేయమంటున్న నారా లోకేష్..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

నారా లోకేష్.. మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈయన ప్రచార వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆయన మాట్లాడుతూ తడబడుతూ ఉండడమే..! కొద్ది రోజుల క్రితం వైఎస్ వివేకానంద మృతిపై 'పరవశించాం' అని ఆయన అన్న వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా ఆ వీడియోను బాగా వాడేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రెండు రోజుల ముందే ఎన్నికల్లో వోట్ వేయమంటున్న వీడియో బయటకు వచ్చింది.

నారా లోకేష్ ఓటర్లతో మాట్లాడుతూ ఏప్రిల్ 9న ఓటేయాలని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు వినియోగించుకునే రోజు ఏప్రిల్ 11.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నారా లోకేష్ కు ఇది కూడా తెలియదా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈవీడియోపై మంగళగిరిలో లోకేశ్ పై పోటీచేస్తున్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ..‘నారా లోకేశ్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటువేయండి. #VoteForFan #TDPLosing’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.