Thursday, August 22, 2019
Follow Us on :

నారా లోకేష్ వాహ‌నంపై రాళ్ల‌దాడి

By BhaaratToday | Published On Apr 5th, 2019

చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ వాహ‌నంపై రాళ్ల దాడి జ‌రిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్ శుక్రవారం సాయంత్రం మంగళగిరి మండలం చినకాకినిలో ప్రచారం చేశారు. అయితే ప్రచారానికి వెళ్తున్న ఓ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు వెనుక భాగంలో ఉన్న అద్దాలు ప‌గిలిపోయాయి. కాగా.. ఈ వాహనం టీడీపీ నేతల పోలవరపు హరిబాబుది అని గుర్తించారు. ఈ దాడిపై హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.