Saturday, October 19, 2019
Follow Us on :

మొదలైన నరేంద్ర మోడీ బయోపిక్ షూటింగ్.. హైలైట్ గా నిలవనున్న అంశాలు ఏంటంటే..?

By BhaaratToday | Published On Jan 29th, 2019

కొద్ది రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే దేశమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మన నాయకుడికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని అందరూ అనుకున్నాం. మేరీకోమ్ సినిమాను తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు అని తెలియగానే ఎంతో హైప్ క్రియేట్ అయింది సినిమా గురించి. ఇక సినిమా ఫస్ట్ లుక్ లో మోడీగా ఉంది వివేక్ ఒబెరాయ్ అని తెలియగానే చాలా మంది షాక్ తిన్నారు. ఇప్పుడు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

సోమ‌వారం నాడు సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అహ్మ‌దాబాద్‌లో ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్, గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాల‌లోను చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఈ చిత్రంలో మూవీలో వివేక్‌ ఓబెరాయ్‌తో పాటు బొమన్‌ ఇరానీ, దర్శన్‌ కుమార్‌ వంటి నటులు నటిస్తున్నారు. సుషేర్‌ ఓబెరాయ్‌, సందీప్‌ సింగ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోడీ బాల్యం, ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు హైలైట్ గా నిలవబోతున్నాయి. రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలను.. ఆ సమస్యలను ఆయన ఎలా సాల్వ్ చేయబోతున్నారో కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.