Tuesday, October 15, 2019
Follow Us on :

మోదీ నోట.. తెలుగులో 'అంతా బాగుంది' అనే మాట..!

By BhaaratToday | Published On Sep 23rd, 2019

అమెరికాలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ సభ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సభలో నరేంద్రమోదీ తెలుగులో మాట్లాడారు. 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరైన ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. 'అంతా బాగుంది' అంటూ తెలుగులో చెప్పుకొచ్చారు. అలాగే పలు భాషల్లో కూడా అంతా బాగుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. దీంతో ఆయా భాషల ఎన్ఆర్ఐలు కరతాళ ధ్వనులతో స్టేడియంను హోరెత్తించారు. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసిన హ్యూస్టన్ వాసులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. 

భారత్-అమెరికా ఆప్తులు.. ట్రంప్ అమెరికా ఎకానమీని పటిష్టం చేశారన్నారు. 'అబ్కీ బార్ ట్రంప్ సర్కార్' నినాదాన్ని మోదీ వినిపించారు. ట్రంప్‌ను కలిసిన ప్రతిసారీ స్నేహ హస్తాన్ని అందించారని.. ట్రంప్‌ను మొదటి సారి కలిసినప్పుడే భారత్ నిజమైన స్నేహితుడు అని ట్రంప్ తనతో చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపేతం అవుతుందన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా ప్రజల అదృష్టమన్నారు.