Tuesday, May 21, 2019
Follow Us on :

టీడీపీ ఓటమి అంటూ తెలుగులో మోదీ ట్వీట్

By BhaaratToday | Published On Apr 1st, 2019

తెలుగు దేశం పార్టీ ఓటమి తప్పదని.. అది కూడా తెలుగులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభలకు ఈరోజు నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ తెలుగులో ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదని కూడా మోదీ చెప్పుకొచ్చారు.

‘ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. 


అలాగే సికింద్రాబాద్ లో జరిగే సభ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. సికింద్రాబాద్... భారత్‌ను మరింత సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దడంలో కష్టపడి పనిచేసే ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉంది. అలాంటి సికింద్రాబాద్ ప్రజలతో ఈరోజు సాయంత్రం కలిసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు.