Tuesday, September 24, 2019
Follow Us on :

మోడీ బయోపిక్ ట్రైలర్.. ప్రత్యర్థులకు షాక్..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

భారత ప్రధాని నరేంద్ర మోడీకి బయోపిక్ కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. మోడీకి సంబంధించిన బయోపిక్ అంటే ఏదో చిన్న చిన్న అంశాలే ఉంటాయని అనుకున్న వారందరికీ షాక్ తెప్పించేలా ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటనల దగ్గర నుండి.. గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వడం.. ఆ తర్వాత భారత ప్రధాని ఎలా అయ్యాడు అనే ఎన్నో అంశాలు అందులో చూపించారు. ఆయన బాల్యం, రైళ్లలో టీ అమ్మిన దృశ్యాలు, ఆర్ఎస్ఎస్ లో చేరడం, గోద్రా అల్లర్లు, ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించడం, ఆపై ఆయనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రధానిగా ఎన్నికకావడం, పాకిస్థాన్ కు వార్నింగ్ ఇవ్వడం లాంటివి చూపించారు. దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, ప్రశాంత్ నారాయణన్‌, జరీనా వాహబ్‌, సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ ఒదిగిపోయాడు. ఒమాంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 5న సినిమా విడుదల కాబోతోంది.