Monday, November 18, 2019
Follow Us on :

రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన నరేంద్ర మోదీ..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించారు. "భారత సర్వోన్నత న్యాయస్థానం రామ మందిర వివాదంపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఎవరి విజయం, అపజయంగా భావించకూడదు.. రామ భక్తి లేదా రహీమ్ భక్తి కంటే భారత్ మీద భక్తి ముఖ్యమని అన్నారు.. భారత ప్రజలంతా శాంతి, సద్భావం, ఏకత్వంతో మెలగాలని" నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 

देश के सर्वोच्च न्यायालय ने अयोध्या पर अपना फैसला सुना दिया है। इस फैसले को किसी की हार या जीत के रूप में नहीं देखा जाना चाहिए। 

रामभक्ति हो या रहीमभक्ति, ये समय हम सभी के लिए भारतभक्ति की भावना को सशक्त करने का है। देशवासियों से मेरी अपील है कि शांति, सद्भाव और एकता बनाए रखें।

   
అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడైంది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పు కోసం హిందువులు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూశారు.. అది ఈరోజు సాకారం అయింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ ఆధీనంలో ఉంచాలని సూచింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.