Wednesday, November 20, 2019
Follow Us on :

ట్విట్టర్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు అమాంతం పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు భారత ప్రధాని. 

ట్విట్టర్ లో నరేంద్ర మోదీకి 5 కోట్ల మంది ఫాలోవర్లు దాటారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షితులైన ఆనేక మంది ప్రజలు ప్రధానిని సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. ఇక మోదీకి  ఫేస్ బుక్ లో 4.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 2.5 కోట్ల మంది యూజర్లు మోదీని అనుసరిస్తున్నారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 10.8 కోట్ల మంది ఫాలోవర్లతో ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవగా, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 6.4 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఒబామా, ట్రంప్ తర్వాత మోదీ మూడో స్థానంలో నిలిచారు.