Monday, November 18, 2019
Follow Us on :

సిద్ధూ.. పాకిస్థాన్ కు వెళ్లొచ్చు..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

నవంబర్ 9న జరగనున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఆ ప్రముఖుల్లో కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు పాకిస్థాన్ వీసా మంజూరు అయినట్లు పాక్ మీడియా తెలిపింది.  పాకిస్థాన్ హై కమిషన్ నవజోత్ సింగ్ సిద్ధూకు వీసాను మంజూరు చేసింది. 

 కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సిద్ధూ వేచి చూసిన సిద్ధూకు గుడ్ న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం. రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉన్న సిద్ధూ, పాక్ లో అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూసిన సిద్ధూకు భారత విదేశాంగశాఖ అనుమతులు జారీ చేసింది. పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన మూడో లేఖ రాశారు. ఆయన లేఖలకు స్పందించిన కేంద్ర ప్రభుతం ఆయనకు వెళ్ళడానికి అనుమతులు ఇచ్చింది. 

భారత యాత్రికులను అనుమతించే విషయంలో పాక్ నుంచి విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయని, తద్వారా గందరగోళం ఏర్పడుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. కొన్నిసార్లు పాస్ పోర్ట్ అవసరం అంటున్నారని, మరి కొన్నిసార్లు పాస్ పోర్ట్ అవసరం లేదంటున్నారని వెల్లడించారు. దీన్ని బట్టి పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి, ఇతర పాక్ సంస్థలకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు.