Tuesday, September 24, 2019
Follow Us on :

వామ్మో.. నీరవ్ మోదీ తప్పించుకోడానికి ఇన్ని ప్లాన్ లు వేశాడా..?

By BhaaratToday | Published On Mar 21st, 2019

పంజాబ్ నేషనల్ బ్యాంకు నీరవ్ మోదీని లండన్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..! అయితే నీరవ్ లుక్ దాదాపుగా మార్చేశాడు. భారత్ లో ఒక లుక్ మేనేజ్ చేసిన నీరవ్.. విదేశాలకు వెళ్ళగానే మొత్తం ఛేంజ్ చేసేశాడు. ఒకానొక దశలో ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని అనుకున్నాడట. ఓ దశలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పూర్తిగా మార్చుకోవాలని కూడా ప్లాన్ వేసినట్లు కథనాలు వచ్చాయి. బ్రిటన్, వెనౌటు అనే చిన్న పసిఫిక్ దీవిలో పౌరసత్వం కోసం అలాగే సింగపూర్ లో శాశ్వత నివాసం కోసం నీరవ్ ప్రయత్నిస్తున్న పనిలో ఉండగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  

నీరవ్‌ మోదీని బ్రిటన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలులో ఉంచారు. ఇక్కడి ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్‌ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ మత్తుపదార్థాల కేసుల్లో అరెస్టైనవారు, మానసిక వైకల్యంతో నేరాలు చేసినవారు ఉంటారు.  1851లో నిర్మించిన ఈ జైల్లో దాదాపు 1,428 మంది ఖైదీలు ఉంటున్నారు. బ్రిటన్‌లో ఒక జైల్లో ఈ సంఖ్యలో ఖైదీలను ఉంచడం చాలా అరుదు. ఇది జైలు సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరుగుదొడ్ల పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను కూడా అతితక్కువ సమయం మాత్రమే బయటకు అనుమతిస్తారు. అంతేకాదు ఇక్కడ ఎవరికీ ప్రత్యేకంగా ఒక గది కేటాయించరు. దీంతో నీరవ్‌కూడా మరో నేరగాడితో తన గదిని పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మార్చి 29 తర్వాత నీరవ్‌ భవిత ఏమిటనేది తేలుతుంది.