Tuesday, May 21, 2019
Follow Us on :

భద్రతా మండలిలో చైనాకు చోటిచ్చింది ఆయనే

By BhaaratToday | Published On Mar 15th, 2019

- కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ధ్వజం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడానికి కారణం దేశ తొలి ప్రధాని నెహ్రూనే అని బీజేపీ ఆరోపించింది. ఆ పాపం నెహ్రూదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జెట్లీ తెలిపారు. నెహ్రూ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్‌కు కాకుండా చైనాకు దక్కేలా చేశారని ఆరోపించారు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకోవడంపై గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ స్పందిస్తూ.. మోదీ బలహీనుడంటూ చేసిన ఆరోపణలను జైట్లీ తిప్పికొట్టారు. ‘కశ్మీరు, చైనా.. రెండింటి విషయంలో అసలు తప్పు చేసింది ఒకే వ్యక్తి’ అని పేర్కొంటూ 1955 ఆగస్టు 2న నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖను ప్రస్తావించారు. ‘పండిట్‌ నెహ్రూ 1955లో ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ‘చైనాను ఐక్యరాజ్యసమితిలోకి తీసుకోవాలి కానీ భద్రతా మండలిలోకి కాదు. దాని స్థానంలో భారత్‌ను భద్రతా మండలిలోకి తీసుకోవాలి అని అమెరికా సూచించింది’... మనం దీన్ని అంగీకరించలేదని అన్నారు.