Saturday, October 19, 2019
Follow Us on :

ఎంపీ ఆజంఖాన్ గారూ.. ఇలాంటి పనులు కూడా చేస్తారా..?

By BhaaratToday | Published On Aug 31st, 2019

నిత్యం వివాదాలతో ఉండే సమాజ్‌వాదీ పార్టీ రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్‌‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆజంఖాన్ పై ఏకంగా ఓ దొంగతనం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన దొంగతనం చేశారని అభియోగాలు మోపబడింది ఏ విషయంలోనో తెలుసా..? ఓ గేదె విషయంలో..! అవును ఎంపీ ఆజం ఖాన్ తమ గేదెను దొంగతనం చేశాడంటూ రాంపూర్ కు చెందిన ఆసిఫ్, జకీర్ అలీ అనే వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. 2016 అక్టోబరు 15న తమ ఇంటిపై దాడి చేసి గేదెను ఎత్తుకెళ్లారని వారిద్దరూ ఫిర్యాదు చేయగా, పోలీసులు అజమ్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. వావాదాలే అనుకున్నాం.. ఆజంఖాన్ గారు ఇలాంటి పనులు కూడా చేస్తారా అంటూ నెటిజన్లు ఆజంఖాన్ పై జోక్స్ పేలుస్తున్నారు.