Friday, December 13, 2019
Follow Us on :

కోడి కత్తి కేసు.. శ్రీనివాస రావుపై సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు

By BhaaratToday | Published On Jul 19th, 2019

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పై ఉన్నాడు. నిందితుడు శ్రీనివాసరావును కొద్ది రోజుల క్రితం  రూ. 60 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరి హామీపై బెయిల్ మంజూరైంది. శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, డెంగీ, మలేరియా, అజీర్ణం అతన్ని ఇబ్బందులు పెడుతున్నాయని, వీటి కారణంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరించడంతో అతడికి అప్పట్లో బెయిల్ ఇచ్చారు. 

 శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అసలు బెయిల్‌ మంజూరుకు కారణాలు కూడా తెలపలేదని ఎన్‌ఐఏ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. ఈ ఘటన పౌర విమానయాన భద్రత చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని కోర్టుకు తెలిపారు.