Tuesday, October 15, 2019
Follow Us on :

చార్మినార్ చుట్టూ ఇకపై తోపుడుబళ్ళు కనిపించకూడదు.. వాళ్లకు షాకే..!

By BhaaratToday | Published On Jan 29th, 2019


చారిత్రాత్మక కట్టడం చార్మినార్ చుట్టూ హోటళ్లతో పాటూ తోపుడు బండ్లు కూడా ఉంటాయి. వాటిలో గాజులతో పాటూ ఎన్నో ఫ్యాన్సీ ఐటమ్స్.. తినుబండారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. అయితే ఇకపై ఆ ప్రాంతంలో తోపుడు బండ్లు కనిపించకపోవచ్చు. ఇది నిజంగా తోపుడు బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారికి షాకింగ్ విషయమే.    

ఇకపై తోపుడు చార్మినార్ చుట్టూ బండ్లు పెట్టకూడదని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 26న అక్కడ గొడవలు జరిగాయి. చార్మినార్ వద్ద తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య ఘర్షణ జరిగడంతో చార్మినార్ చూడటానికి వచ్చిన పర్యాటకులు భయాదోళనకు గురయ్యారు. ఏదో ప్రమాదం జరిగింది అని అక్కడి పరుగులు తీశారు. దీంతో కొందరు పర్యాటకులు గాయపడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తోపుడు బండ్లు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ గొడవల కారణంగా పోలీసులు ఇకపై తోపుడు చార్మినార్ చుట్టూ బండ్లు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు.