Saturday, October 19, 2019
Follow Us on :

ఇలా జరుగుతుందని అసలు ఊహించని చిదంబరం..!

By BhaaratToday | Published On Aug 22nd, 2019

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ కస్టడీ విధించారు. చిదంబరంను నాలుగు రోజుల సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 26 వరకూ చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. చిదంబరం కుటుంబసభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు రోజూ కలవవచ్చని కోర్టు తెలిపింది. 

చిదరంబరం అరెస్ట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు.  ఆయన అరెస్ట్‌ లో ఓ స్పెషల్ ఉంది. కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది చిదంబరమే. ఇప్పుడు అదే కార్యాలయంలో ఆయన కస్టడీలో ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్ర మోదీ ఇండియా మళ్లీ నిరూపిస్తోందని ట్వీట్ చేశారు.