Saturday, August 24, 2019
Follow Us on :

పాపం.. ఐపీఎల్ ను జపిస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు..!

By BhaaratToday | Published On Mar 12th, 2019

ఐపీఎల్.. ఎంతో మంది క్రికెటర్ల తలరాతలను మార్చివేసింది. అటువంటి ఐపీఎల్ లో భాగస్వామ్యులు కావాలని ప్రతి ఒక్క క్రికెటర్ కూడా అనుకుంటూ ఉంటారు. భారత్ ప్రతి ఒక్క దేశానికి చెందిన క్రికెటర్ ను కూడా ఐపీఎల్ లో ఆడిస్తోంది కానీ.. పాక్ క్రికెటర్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో పాక్ క్రికెటర్లను వేలంపాటలోకి అనుమతి ఇవ్వరు. మొదట్లో అనుమతి ఇచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఆ వైపు కూడా బీసీసీఐ చూడడం లేదు. పాకిస్థాన్ క్రికెటర్లు కూడా తమకు ఐపీఎల్ లో ఆడాలని ఉందంటూ పలుమార్లు తమ ఇష్టాన్ని బయటపెట్టారు. 

ఇప్పుడు పాకిస్థాన్ లో పీఎస్ఎల్ జరుగుతోంది.. మన ఐపీఎల్ లాగే పీఎస్ఎల్ కూడా ఒక లీగ్..! ఆ లీగ్ ద్వారా వచ్చే రెవెన్యూ తక్కువే.. ఇచ్చే ప్రైజ్ మనీ కూడా తక్కువే..! చాలా భాగం మ్యాచ్ లు దుబాయ్, అబుదాబీలో నిర్వహిస్తారు. ఏదో చివరి రౌండ్ పాకిస్థాన్ లో ఆడుతారు. పాక్ లో సెక్యూరిటీ రీజన్స్ చెప్పి ఆడటానికి నిరాకరించే ఆటగాళ్లే ఎక్కువ కాబట్టి.. ఎక్కువ మ్యాచ్ లు విదేశాల్లోనే నిర్వహిస్తారు. ఐపీఎల్ స్థాయిని అందుకుంటాం అని కలలు కంటూ ఉంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అయితే పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ భజన చేస్తూ ఉన్నారు. 

తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కూడా ఐపీఎల్ పాకిస్థాన్ లో జరగాలంటూ నాలిక్కరుచుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన భారత అభిమానులు పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు. ఉమర్ అక్మల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో మాట్లాడుతూ క్వెట్టా జట్టు కరాచీకి చేరుకుందని.. సొంత గ్రౌండ్ లో ఆడబోతున్నామని.. బెస్ట్ టీమ్ గెలుస్తుందని.. అలాగే ప్రేక్షకులు కూడా అందరినీ సపోర్ట్ చేయాలని.. ఇలాగే జరిగితే వచ్చే ఐపీఎల్(నాలిక్కరుచుకున్నాడు) సారీ పీఎస్ఎల్ పాకిస్థాన్ లోనే జరుగుతుందని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఇంకేముంది మన వాళ్ళు ఆ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మొదటి ఐపీఎల్ లో మాత్రమే బీసీసీఐ పాకిస్థాన్ ఆటగాళ్ళను ఐపీఎల్ లో ఆడనిచ్చింది.. ఆ తర్వాత ఇప్పటివరకూ అనుమతి ఇవ్వలేదు.