Monday, December 09, 2019
Follow Us on :

దక్షిణ భారతంపై ఉగ్రదాడి అవకాశం అన్నారు.. ఇంతలోనే..!

By BhaaratToday | Published On Sep 10th, 2019

దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని సోమవారం నాడు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అలాంటి తరుణంలో తమిళనాడులో తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు, చెన్నై పోలీసులు కలిసి చెన్నై లో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న వ్యక్తిని అసదుల్లా షేక్ గా గుర్తించారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 

 దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాతి రోజే ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.   దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఆర్మీ సదరన్ కమాండ్ కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు. అలాగే భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని అన్నారు.