Tuesday, September 24, 2019
Follow Us on :

నిఖిల్ సినిమాకు అవెంజర్స్ దెబ్బ..!

By BhaaratToday | Published On Apr 25th, 2019

యంగ్ హీరో నిఖిల్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి. ఎందుకంటే నిఖిల్ ఎంచుకునే సబ్జెక్టులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. నిఖిల్ లేటెస్ట్ సినిమా 'అర్జున్ సురవరం'. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మే మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే అది వీలుపడలేదు. ఈ నెల 26వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో 'అవెంజర్స్ ' భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై ఉండటం వలన, ఆశించినస్థాయిలో థియేటర్స్ లభించకపోవడం వలన 'అర్జున్ సురవరం' విడుదలను మరోసారి వాయిదా వేశారు.

 

Related image

ప్రస్తుతం అవెంజర్స్ సినిమా మేనియాలో ప్రేక్షకులు ఊగిపోతున్నారు. మెట్రో నగరాల్లో ఆ సినిమా టికెట్లు దక్కడమే కష్టంగా ఉంది. భారీ హైప్ ఉన్న ఈ సినిమాను తట్టుకొని నిలబడడం కష్టమే..! అవెంజర్స్ ఊపు కాస్త తగ్గాక అర్జున్ సురవరం సినిమాను విడుదల చేయడం చాలా బెటర్ అని భావించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అర్జున్ సురవరం సినిమా విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం సాధిస్తుందని చిత్ర బృందం తెలిపింది.