Wednesday, October 16, 2019
Follow Us on :

ఆయ‌న పోరాటం నాలాంటి వాళ్ల‌కు స్ఫూర్తిదాయకం

By BhaaratToday | Published On Jun 11th, 2019

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ని కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ మర్యాదపూపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి నివాసానికి రాగా.. సీఎం జగన్‌ నిఖిల్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించారు. కాగా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్‌ పేర్కొన్నారు. 

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వైఎస్‌ జగన్‌ రాజకీయ పోరాటం తన వంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని నిఖిల్‌ గౌడ అన్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇదిలావుంటే.. లోక్‌ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్‌ నిఖిల్‌పై గెలుపొందారు.