Thursday, July 18, 2019
Follow Us on :

క‌ష్టాల కారాగారంలో నీర‌వ్ మోదీ..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

లండన్‌లో అరెస్టైన ఆర్థిక నేర‌గాడు నీరవ్‌ మోదీని అక్కడే కస్టడీలో ఉండాలని విస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేఫ‌థ్యంలో నీరవ్‌ను తరలించే జైలు అత్యంత క‌ఠిన‌మైన బంధీఖానాగా అక్క‌డి వారు అభివ‌ర్ణిస్తారు. బ్రిటన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలు ఇది. ఇక్కడి ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్‌ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ మత్తుపదర్థాల కేసుల్లో అరెస్టైనవారు, మానసిక వైకల్యంతో నేరాలు చేసినవారు ఉంటారు. 

1851లో నిర్మించిన ఈ జైల్లో దాదాపు 1,428 మంది ఖైదీలు ఉంటున్నారు. బ్రిటన్‌లో ఒక జైల్లో ఈ సంఖ్యలో ఖైదీలను ఉంచడం చాలా అరుదు. ఇది జైలు సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరుగుదొడ్ల పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను కూడా అతితక్కువ సమయం మాత్రమే బయటకు అనుమతిస్తారు. అంతేకాదు ఇక్కడ ఎవరికీ ప్రత్యేకంగా ఒక గది కేటాయించరు. దీంతో నీరవ్‌కూడా మరో నేరగాడితో తన గదిని పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మార్చి 29 తర్వాత నీరవ్‌ భవిత ఏమిటనేది తేలుతుంది.