Thursday, December 12, 2019
Follow Us on :

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కే షాక్ ఇచ్చిన అల్లు అరవింద్, దిల్ రాజు

By BhaaratToday | Published On Jul 17th, 2019

జెర్సీ.. నాని నటించిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది. టాలీవుడ్ లో మంచి వసూళ్లను సాధించింది కూడా..! ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్లబోతోంది. ఇప్పటికే షాహిద్ కపూర్ ని మెయిన్ లీడ్ గా అనుకుంటున్నారని, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే కరణ్ జోహార్ ను కాదని టాలీవుడ్ నిర్మాతలే బాలీవుడ్ లో ఈ సినిమా రూపొందించబోతున్నారు. 

జెర్సీ సినిమాను తెలుగులో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ తీసుకునే సమయంలో కరణ్ జోహార్ చాలా తక్కువ ధరకు రైట్స్ అడిగారట.. అది కూడా సోలోగా ప్రొడ్యూస్ చేసుకుంటామని చెప్పడంతో రీమేక్ రైట్స్ ఇవ్వడానికి మన నిర్మాతలు ఒప్పుకోలేదు. దీంతో ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటరై్టన్మెంట్స్‌తో కలిసి నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు హిందీలో రీమేక్‌ చేయనున్నారు. గతంలో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన గజినీ సినిమా ఏ రేంజిలో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఈ మెగా ప్రొడ్యూసర్ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాంచి కథ, అది కూడా క్రికెట్ నేపథ్యం కాబట్టి బాలీవుడ్ జనాలకు జెర్సీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే తరువాయి..!