Monday, November 18, 2019
Follow Us on :

హీరో ప్ర‌భాస్ కేసులో హైకోర్టు కీల‌క తీర్పు

By BhaaratToday | Published On Apr 24th, 2019

► ఆ భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధం 
► ఆ భూమిని ప్ర‌భాస్‌కు అప్ప‌గించ‌లేం
► హైకోర్టు సంచ‌ల‌న తీర్పు 
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని తన భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ భూముల నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే,  1958 నుంచి భూములకు సంబంధించిన వివాదం కొన‌సాగుతున్నందున ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్‌కు అప్పగించలేమని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాలకుపైగా వివాదంలో ఉన్న భూముల వ్యవహారంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు సమసిపోతాయని పేర్కొన్న కోర్టు..ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.