Tuesday, October 15, 2019
Follow Us on :

బండి పత్రాలను తీసుకొని వెళ్లలేదా.. ఫైన్ పడకుండా ఇలా తప్పించుకోండి..!

By BhaaratToday | Published On Sep 24th, 2019

ఇటీవలి కాలంలో ట్రాఫిక్ ఛలానాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా నిబంధనలను అతిక్రమించారో జేబు ఖాళీనే..! ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ ఫైన్స్ వేస్తున్నారు పోలీసులు. మీరు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినా.. మైనర్లకు బైక్ ఇచ్చినా.. పర్స్ ఖాళీ అయిపోతుంది. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు 2019లో భాగంగా భారీగా ఫైన్స్ చెల్లించాల్సిందే..! కానీ కొన్ని కొన్ని సార్లు అన్ని పత్రాలు ఉన్నా.. పర్సును తీసుకొని వెళ్లకుండా ఉంటే ఎలా అన్నది అందరికీ వస్తున్న డౌట్..! 

అలాంటి సమయంలో మీ మొబైల్ ఫోన్ మిమ్మల్ని భారీ ఫైన్స్ నుండి కాపాడుతుంది. అందుకు మీరు ఏమి చేయాలంటే DigiLocker మరియు mParivahan అనే రెండు యాప్స్ ను మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ యాప్స్ లో మీరు ముందుగానే మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్.. లాంటి పత్రాలను ఉంచుకోవాలి. అప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి పోలీసులకు చూపిస్తే ఫైన్స్ పడవు. ఒకవేళ ఫోన్ కూడా మరచిపోయారనుకోండి.. ట్రాఫిక్ పోలీసులు సదరు వెబ్ సైట్ లలోకి వెళ్లి వాహనదారులకు సంబంధించిన పత్రాలను చెక్ చేయొచ్చు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సూచనలను జారీ చేసింది.