
ఈ ఫొటోలో ఉన్న పిల్లాడు ఎవరో తెలుసా..?
సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఉన్న ఈ పిల్లాడు.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్..!
ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించాడు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్.. కొడుకు అభయ్ రామ్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఆ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ 2020లో విడుదల కానుంది.