Thursday, April 25, 2019
Follow Us on :

ఇప్ప‌టికీ అంబాసిడ‌ర్‌ కారు వాడుతున్న‌ది ఈ ముఖ్య‌మంత్రేన‌ట‌

By BhaaratToday | Published On Mar 22nd, 2019

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికీ పాతకాలపు అంబాసిడర్ కారునే వాడతారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఒకప్పుడు అంబాసిడర్ కారు రాజకీయ, అధికార వర్గాల్లో రారాజై వెలిగింది. కాలక్రమంలో ఇతర కార్లతో పోటీపడలేక వెనుకబడిపోయింది. అయితే, నవీన్ పట్నాయక్ వంటివాళ్లు ఇప్పటికీ అంబాసిడర్ కారును వినియోగిస్తున్నార‌ట‌. తాజాగా, ఎన్నికల నామినేషన్ సందర్భంగా దాఖలుచేసిన అఫిడవిట్ లో ఈ విషయం పేర్కొన్నారు. 1980ల నాటి  తన కారు ప్రస్తుత విలువను ఆయన రూ.9000 గా చూపించారు. 2000 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వ‌స్తున్నారు ఐదోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని కృతనిశ్చయంతో ఉన్న ఆయన అఫిడవిట్ లో తన ఆస్తుల మొత్తం విలువ రూ.63 కోట్లుగా పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. 2014లో నవీన్ పట్నాయక్ తన ఆస్తుల విలువను రూ.12 కోట్లుగా చూపించారు.