Sunday, August 18, 2019
Follow Us on :

వృద్ధురాలికి అవ‌మానం.. మంత్రి గారు స‌మ‌స్య తీరుస్త‌డ‌ని వ‌స్తే..

By BhaaratToday | Published On Jul 16th, 2019

సాధారణంగా మినిస్టర్ సారు వ‌స్తున్నాడంటే ఎట్లుంట‌ది. కుయ్ కుయ్ అని కార్లు.. పోలీసోల్ల బందోబ‌స్తు. గల్లీ లీడర్ల హడావుడి..! ఇంకోదిక్కు అధికారం చేతిల ఉండే.. ఏదైనా రంది ముచ్చట చెప్పుకుంటే.. పైసో.. పనో చేశిపెడ్తడు గదా.. అని చాల‌మంది ఎదురుచూస్తరు. అట్లనే ఓ ముసలవ్వ కూడా వ‌చ్చింది. మంత్రివర్యులు దయాకరు సారు.. దయగల్లోడు. మంచి మ‌న‌సు ఉన్నమనిషి అని.. మైళ్ల దూరం నుంచి వ‌చ్చి పడిగాపులు గాసింది. సారు సేవ చేసినోళ్లను మర్చిపోడని మురిసిపోయింది ఆ అవ్వ. చివ‌రికి ఏం జ‌రిగిందంటే.. స‌మ‌స్య చెప్పుకుందామ‌ని వ‌చ్చిన ఆ అవ్వ‌ను లేడి కానిస్టేబుల్ లాగడంతో ఆవ్వ మంత్రితో మాట్ల‌డ‌లేక‌పోయింది. దీనిపై ఆమె తీవ్ర‌స్థాయిలో  ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

ఆ అవ్వ పేరు అమీనాబీ. టీడీపీ పార్టీ అభిమాని. ఇదేంది అనుకుంటున్నారా..? టీడీపీ పార్టీకి కొన్నేండ్ల పాటు ఆ అవ్వ భర్త సేవ చేసిండట. మరి అప్పుడు ఈ దయాకర్ సారు సైకిల్ పార్టీల్నే ఉన్న‌డు గ‌దా..! ఇప్పుడు కండువా మార్చి గులాబీ కండువా క‌ప్పుకునే.. ప‌నిలోప‌ని మంత్రి అయిపాయే. అవ్వ కూడా దయాసారు కోసం జెండామోసి.. సేవ జేసింద‌ట. టీడీపీ హయాంల జిల్లా మైనార్టీ సెల్ మ‌హిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేసింద‌ట‌. ఇప్పుడు ఏం ఆప‌ద‌ అచ్చిందో పాపం.. మంత్రిసారుకు చెప్పుకుంటే భాద‌తీరుస్త‌డ‌ని వ‌చ్చింది అవ్వ. 
 
అయితే.. పాత ముచ్చట్లు మనకెందుకు అనుకున్న‌డో.. లేకపోతే..! పాత పార్టీ వాళ్ల‌తో మనకేంది అనుకున్న‌డో తెలియ‌దు కానీ.. మాటైనా మాట్లాడలేదు దయాక‌ర్... సారు..! ఆ ఆవ్వ నిరాశ‌తోనే వెనుదిరిగింది. 30 ఏళ్ల‌ నుంచి సేవ చేసినోళ్లనే పట్టించుకోకుంటే.. కార్యకర్తలను, సామాన్య జనాన్ని ఏం పట్టించుకుంటర‌ని మంత్రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వేళ మంత్రి గులాబీ కండువా వేసుకున్నోళ్లనే పట్టించుకుంటరా..? లేకుంటే ఓట్లేసినోళ్లకే పనిజేసి పెడ్తరా..? అని తిట్టుకుంటున్నారు.