Wednesday, October 16, 2019
Follow Us on :

భారత డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అవార్డు.. ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్

By BhaaratToday | Published On Feb 25th, 2019

ఆస్కార్ అవార్డుల సందడి ముగిసింది. 91వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలు విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా అల్పాన్సో కురోన్, ఉత్తమ నటుడిగా రమి మలేక్,  ఉత్తమ నటి-ఒలివియా కోల్మన్, ఉత్తమ సహాయ నటుడిగా మహెర్ షాలా అలీ, ఉత్తమ సహాయ నటిగా రెజీనా కింగ్ అవార్డులు అందుకున్నారు.  అలాగే.. అల్ఫాన్సో కౌరోన్ కు బెస్ట్ సినిమాటో గ్రఫీ, ఉత్తమ విదేశీ బాషా చిత్రంగా రోమా, బెస్ట్ డాక్యు మెంటరీ గా ఫ్రీసోలోకు ఆస్కారులు దక్కాయి.

ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘పిరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఆడవాళ్ల రుతుస్రావ సమస్యల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 25 ఏళ్ల రైకా జెహత్ బచి దర్శకత్వం వహించారు. లంచ్ బాక్స్ చిత్రాన్ని నిర్మించిన గునీత్ మోంగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆడపిల్లలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ‘పీరియడ్‌’.  25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఇక రోమా చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకుంటుందని అందరూ భావించారు. అయితే 'గ్రీన్ బుక్' చిత్రం చిన్న షాక్ అయితే ఇచ్చింది.   


ఉత్తమ చిత్రం - గ్రీన్ బుక్
ఉత్తమ దర్శకుడు - ఆల్ఫోన్సో కారోన్ (రోమా)
ఉత్తమ నటుడు - రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)
ఉత్తమ నటి - ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)
ఉత్తమ సహాయ నటుడు - మహర్షెలా అలీ (గ్రీన్ బుక్)
ఉత్తమ సహాయ నటి - రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ విదేశీ చిత్రం - రోమా (మెక్సికో)
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ - స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
ఉత్తమ ఒరిజినల్ స్క్నీర్ ప్లే - గ్రీన్ బుక్
ఉత్తమ సినిమాటోగ్రఫీ - అల్ఫోన్సా కారాన్ (రోమా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - ఫస్ట్ మ్యాన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - బ్లాక్ ఫాంథర్
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ - రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్)