Monday, November 18, 2019
Follow Us on :

ఒవైసీని అరెస్టు చేయండని అమిత్ షాను కోరిన రాజా సింగ్

By BhaaratToday | Published On Nov 9th, 2019

సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. సుప్రీంకోర్టు నిజంగా అత్యున్నతమైనదేనని.. కానీ పొరపాటుపడనిది కాదని అన్నారు..! తాము 5 ఎకరాల భూమి కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. తమకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని, తాము తమ హక్కులపై పోరాటం చేశామని చెప్పారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని.. ఆ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. రివ్యూ పిటషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఒవైసీ తన ప్రకటనల ద్వారా భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఒవైసీని అరెస్ట్ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజాసింగ్ ట్వీట్ చేశారు. రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇరువర్గాల ప్రజలు అంగీకరిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోనే కాదు, మరే ఇతర నగరంలోనూ శాంతికి భంగం వాటిల్లాలని తాము కోరుకోవడం లేదని అన్నారు.