Tuesday, October 15, 2019
Follow Us on :

ఉద్రిక్తలను పెంచేలా ప్రవర్తిస్తూ.. 2000 మంది సైనికులను తరలించిన పాక్

By BhaaratToday | Published On Sep 5th, 2019

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాకిస్థాన్ కు ఏ మాత్రం మింగుడు పడలేదు. ప్రపంచదేశాల ముందు భారత్ ను దోషిగా చూపాలని పాకిస్థాన్ చేసిన ఏ ఒక్క ప్రయోగం కూడా ఫలించలేదు. అంతేకాకుండా సరిహద్దులో కూడా పాక్ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పుల విరమణకు తెగిస్తూ తీవ్రవాదులను భారత్ లోకి పంపాలని పాక్ భావిస్తోంది. ఇప్పుడేమో భారత్ సరిహద్దులో సైనికుల సంఖ్యను పెంచడం మొదలుపెట్టింది. 

పీవోకేలోని నియంత్రణ రేఖ వద్దకు భారీ ఎత్తున సైనికులను పంపించింది. నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో 2 వేల మందికి పైగా సైనికులను మోహరింపజేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. వీళ్లంతా దాడి చేసే యత్నాల్లో లేరని, అయినా వీరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. ఎటువంటి చర్యనైనా తిప్పిగొట్టగలిగే శక్తి భారత్ సొంతమని తెలిపారు అధికారులు.