Thursday, September 19, 2019
Follow Us on :

ప్రియాంక చోప్రా మీద కూడా కక్ష కట్టిన పాక్ మీడియా.. ఆ దేశ ప్రతినిధులు

By BhaaratToday | Published On Aug 21st, 2019

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారత్ ను ఇరుకున పెట్టాలని.. భారత్ కు చెందిన సెలెబ్రిటీలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. భారత్ ను ఎలాగూ దెబ్బతీయలేకపోతోంది కాబట్టి మన సెలెబ్రిటీల మీద తన అక్కసును మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రియాంక చోప్రాపై పడింది. ఎందుకంటే ఇటీవల కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో భారత్ ది ఎటువంటి తప్పు లేదని.. కాశ్మీర్ పై భారత్ కు సర్వ హక్కులూ ఉన్నాయని చెప్పేసింది. దీంతో అప్పటి నుండి ప్రియాంకకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలను వండి వార్చింది పాక్ మీడియా. ఇప్పుడు ఆ దేశ అధికారులు ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక కు వ్యతిరేకంగా లేఖ రాశారు.   

 ప్రియాంక చోప్రాను ఇటీవల ఓ పాకిస్థాన్ మహిళ.. ‘భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉంటూ ఇలా చేయకూడదు అని అడిగింది. దీనికి ప్రియాంక సరైన సమాధానం ఇచ్చింది. 
పాక్ లో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా అంటూ సరైన సమాధానం చెప్పడంతో ఆ పాకిస్థానీ మహిళ నోరుమూసుకుంది. 

ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను సమర్థిస్తూ  మాట్లాడుతున్నారని పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాశారు. ‘జమ్మూకశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు’ అని లేఖలో ఫిర్యాదు చేశారు.