Thursday, September 19, 2019
Follow Us on :

భారతీయ యువతిని పెళ్లాడిన పాక్ క్రికెటర్

By BhaaratToday | Published On Aug 21st, 2019

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లి చేసుకున్నాడు. పాక్ జట్టులో ఫాస్ట్ బౌలర్ అయిన హసన్ అలీ వివాహం దుబాయ్ లో షామియా అర్జూను వివాహం చేసుకున్నాడు. హసన్ అలీ భార్య షామియా హర్యానాకు చెందిన యువతి. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఆమె ఫ్లైట్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. తన పెళ్లికి భారత క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని గతంలోనే హసన్ అలీ తెలిపాడు. 

Image result for hasan ali

తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని.. మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశాడు. హసన్ అలీకి సానియా మీర్జా శుభాకాంక్షలు తెలిపింది. 'కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి' అని ట్వీట్ చేసింది.

Image result for hasan ali