Monday, September 23, 2019
Follow Us on :

మారని పాక్ తీరు.. వాళ్ళు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారట..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, స్లోవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఉగ్రవాదంపై ఆయా దేశాల అగ్రనేతలతో చర్చలు జరపనున్నారు రాష్ట్రపతి. పర్యటనల్లో పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై దేశాధినేతలతో చర్చించనున్నారు. 

అయితే పాక్ అనుకున్నట్లుగానే తన బుద్ధి చూపించింది. పాక్ గగనతలంపై రాష్ట్రపతి విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భారత్‌ అభ్యర్థనను తాము సంపూర్ణంగా తిరస్కరిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారన్నారు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి  షా మహ్మద్‌ ఖురేషీ. 

జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజ్ స్థాన్ లో జరిగిన షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు వెళ్లారు. అప్పుడు పాక్ చెప్పిన రెండు రూట్లలో కాకుండా వేరే రూట్ లో మోదీ ప్రయాణించాల్సి ఉండడంతో పాక్ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్ ను కోరింది. పాకిస్థాన్ అందుకు సానుకూలంగా స్పందించింది. మోదీ ప్రయాణించే విమానం అనుకున్న రూట్ లోనే వెళ్లవచ్చని తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని పాకిస్థాన్ చెప్పింది. కానీ మోదీ మాత్రం ఎస్‌సీఓ సదస్సుకు పాకిస్థాన్ అధీనంలో ఉన్న వాయు మార్గాలు నుంచి కాకుండా ఒమెన్ మార్గం గుండా వెళ్లారు.