Saturday, October 19, 2019
Follow Us on :

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోన్న పాక్.. అప్రమత్తమైన భారత్

By BhaaratToday | Published On Aug 12th, 2019

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది పాకిస్థాన్. లడాఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. అలాగే జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోంది.

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంతో ఏమి చేయాలో పాకిస్థాన్ కు తెలియడం లేదు. అందుకే భారత్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని తెగ ప్రయత్నిస్తోంది. కానీ కుదరడం లేదు. ఇప్పటికే ఉగ్రవాదులను భారత్ మీద ఉసిగొల్పుతోంది. సైన్యం అండతో భారత్ లోకి తీవ్రవాదులను పంపించే ప్రయత్నాల్లో ఉంది పాక్. ఇక ఆ దేశ ప్రధాని కూడా పుల్వామా తరహా ఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారంటే తీవ్రవాదులకు ఎంతగా వంతపాడుతున్నారో అర్థం అవుతుంది.