Monday, September 23, 2019
Follow Us on :

జమ్మూ కాశ్మీర్ భారత్ లోని రాష్ట్రం అని ఒప్పేసుకున్న పాకిస్థాన్

By BhaaratToday | Published On Sep 10th, 2019

జమ్మూ కాశ్మీర్ పై సర్వ హక్కులూ మావే అంటూ తెగ ఎగిరింది పాకిస్థాన్. అయితే ఆ దేశానికి కాశ్మీర్ పై ఎటువంటి హక్కులూ లేవన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. జమ్మూ కాశ్మీర్ భారత్ దేశం లోని రాష్ట్రం అని ఇప్పుడు అదే పాకిస్థాన్ నోటి నుండి వచ్చింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రే ఈ విషయాన్ని తన నోటి నుండి స్వయంగా చెప్పేసారు. ఇలాంటప్పుడు ఇతర దేశానికి చెందిన రాష్ట్రంలో వేరే దేశం తలదూర్చడం అవసరమా అన్నది అందరూ ప్రశ్నిస్తున్నారు.   

 
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో ప్రసంగం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మీడియాతో మాట్లాడుతూ, కశ్మీర్‌ను ఇండియన్ స్టేట్ గా సంబోధించాడు. కశ్మీర్‌లో జనజీవనం యథాపూర్వ స్థితికి వచ్చిందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అదే నిజమైతే అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించాడు.  భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎందుకు వీలు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు.