Thursday, September 19, 2019
Follow Us on :

పాకిస్థాన్ కు కొత్త కష్టం.. అయిదుగురు మృతి..!

By BhaaratToday | Published On Apr 15th, 2019

పాకిస్థాన్ కు మరో చిక్కు వచ్చి పడింది. ఆ దేశాన్ని ఇప్పుడు ఇసుక తుఫాను వణికిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు పాక్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి కరాచీపై ఇసుక తుఫాను దూసుకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం కూడా ఇసుక తుఫాను కరాచీని విడిచిపెట్టలేదు. బలమైన గాలులు వీయడంతో చాలా ఆస్థి నష్టం కలిగినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఇప్పటికి అయిదు మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. వందల మంది ఇసుక తుఫాను కారణంగా గాయపడినట్లు తెలుస్తోంది. చాలా చోట్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. సింధ్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. 

 

కార్లు తుఫాను దెబ్బకు తిరిగి పడడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్ని భవనాలు కూడా కూలిపోయాయి. ఈ ఇసుక తుఫాను మంగళవారం నాడు కూడా కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.