Wednesday, October 16, 2019
Follow Us on :

ఎప్పటికీ మారరు.. మోదీ హిస్టారికల్ టూర్ పై విషం కక్కారుగా

By BhaaratToday | Published On Sep 24th, 2019

మోదీ...మోదీ...! నినాదాలతో హ్యూస్టన్ నగరం హోరెత్తింది! అమెరికాలో 50వేల ప్రవాస భారతీయులతో ఇంత పెద్ద సభ జరగడం ఇదే మొదటిసారి! అంతేకాదు ఈ కార్యక్రమానికి ఓ అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం కూడా ఇదే తొలిసారి! మోదీ-ట్రంప్ జోడీని చూసి ఎన్ఆర్జీ స్టేడియం చప్పట్లు నినాదాలతో దద్దరిల్లింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి వేదికపైకి వచ్చిన మోదీ ఆంగ్లంలో ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడారు.

ట్రంప్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రవాసభారతీయులను ఉద్దేశించి హిందీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా...ఆ దేశం తీరును మోదీ ఎండగడుతున్నప్పుడు అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవాళ్లు అంటూ పీఎం మోదీ పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే మండిపడ్డారు. అమెరికాపై జరిగిన ఉగ్రదాడి 9/11, అలాగే ముంబై ముట్టడి 26/11 కుట్రదారులు ఎక్కడ ఉంటారు!? అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సమక్షంలోనే తేల్చిచెప్పారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాక్షిగా ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడాన్ని సైతం ప్రస్తావించారు. ఈ అంశం ప్రస్తావించగానే...సభలోని వారంత తమ కరతాళ ధ్వనులతో సమర్థించారు. పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే...ఉగ్రవాదుల అడ్డా అంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కారణమైన ఆర్టికల్ 370కి తాము ఫేర్ వెల్  పలికామన్నారు.  అక్కడి ప్రజలను  అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై  పార్లమెంటులో పెద్ద చర్చే  జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు  విజయం సాధించింది. ఇందుకు కారణమైన భారత ఎంపీలను అభినందించాలని మోదీ పిలుపు ఇవ్వడంతో...ప్రవాస భారతీయులంతా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ చేశారు.


జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత..., ప్రపంచ దేశాల ముందుకు వెళ్లి భారత్ పై అసత్య ప్రచారానికి దిగిన పాకిస్తాన్ కు మాత్రం మద్దతు లభించలేదు. ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్ ను ఛీ కొట్టాయి. అదే సమయంలో ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతతో ఆపరేషన్ ఆలౌట్ ను ప్రారంభించిన మోదీ సర్కార్....పాకిస్తాన్ ఆధీనంలోని పీవోకే ను తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో...వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మోదీ-ట్రంప్ హ్యూస్టన్ వేదికపై కలిసి ప్రసంగిస్తున్న సమయంలో...అమెరికాలోనే ఉన్న ఇమ్రాన్  తన హోటల్ గది నుంచి కనీసం బయటకు రాలేదని అంటున్నారు. ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయితే ముఖమే చాటేశారు. హ్యూస్టన్ వేదిక వద్ద పాకిస్తాన్ తన కిరాయి ఎన్జీవో సంఘాలతో ధర్నా చేసే ప్రయత్నం కూడా పూర్తిగా విఫలమైంది. 

అమెరికాలో ప్రధాని మోదీ జరిపిన హిస్టారికల్ టూర్ పై పాకిస్తాన్ మీడియా అయితే విషం కక్కింది! చేతిలో చిప్పపట్టుకుని ప్రపంచ దేశాలు తిరుగుతున్న పాక్ ప్రధానిని అమెరికాలో పట్టించుకునే వారే కరువయ్యారు! అమెరికాలోని పాకిస్తాన్ దౌత్యకార్యాలయ సిబ్బంది తప్ప...అమెరికా అధికారులు ఎవ్వరూ కూడా రాలేదు!    


హ్యూస్టన్ లో ప్రధాని మోదీ...విమానం దిగినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత దౌత్యసిబ్బందితోపాటు...ప్రవాస భారతీయులు, అమెరికా అధికారులు వెల్ కమ్ చెప్పారు. తర్వాత 18 చమురు కంపెనీల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన వారం రోజుల ఈ పర్యటనలో ప్రధాని మోదీ తీరిక లేని కార్యక్రమాలతో పుల్ బిజిగా మారిపోయారు.   

పాకిస్తాన్ ప్రధాని...తమ దేశం నుంచి బయలుదేరే ముందు బీరాలకు పోయాడు. కశ్మీర్ పై ప్రపంచ దేశాల మద్దతును కూడగడతామని చెప్పారు. అయితే ప్రపంచ దేశాల సంగతిని పక్కన పెడితే....తోటి ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్ కు మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టేందుకు చేసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 


అమెరికా బయలుదేరేముందు ఇమ్రాన్ ఖాన్ రెండు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించారు. భారత్ కు వ్యతిరేకంగా సౌదీ మద్దతు కోరారు. అయితే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేందుకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాకిస్తాన్ ప్రధాని కూడా చిప్పచేత పట్టుకుని ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించారో ఏమో...సౌదీ యువరాజు సల్మాన్..పాక్ ప్రధాని ఇమ్రాన్ కు తన ప్రత్యేక విమానంలో చోటు ఇచ్చారు. సౌదీ యువరాజు విమానంలో అమెరికా చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని ముఖంలో ఎక్కడ నవ్వు మాత్రం కనిపించలేదు.  విమానశ్రాయంలో అమెరికా ప్రొటోకాల్ అధికారులు కూడా కనిపించలేదు. పాకిస్తాన్ దౌత్య సిబ్బందే కానవచ్చారు.! మీడియా కనిపంచగానే భారత్ పై రెచ్చిపోయే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ముఖం చాటేశారు. 


యూఎన్ విడుదలచేసిన ప్రాథమిక జాబితా ప్రకారం.. సెప్టెంబర్‌ 27న రాత్రి  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. తర్వాత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అదే రోజు అర్ధరాత్రి మాట్లాడే అవకాశం ఉంది. ఈ సమావేశం నుంచి కొందరు నాయకులు తప్పుకుంటే ఇమ్రాన్‌ ఖాన్‌కు నిర్ణీత సమయం కన్నా ముందే మాట్లాడే  అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇమ్రాన్‌ ఖాన్‌ తన  ప్రసంగంలో భారత్‌లో కశ్మీర్‌కు ఆర్టికల్‌370 రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఇటు యూఎన్ వేదికగా ఇమ్రాన్ కు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ కూడా రెడీ అయ్యిందని సమాచారం.

 పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో పాక్ సైన్యం  తీవ్రమైన మానవ  హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, పాక్ మానవ హక్కుల ఉల్లంఘన నుంచి తమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌కు సింధి కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. సింథ్ ప్రాంతానికి  'విముక్తి' కల్పించాలనే సందేశాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వీరు మోదీ,ట్రంప్ లను కలిసి తమ విజ్ఞాపన వినిపించేందుకు హ్యూస్టన్ కు తరలివచ్చారు. 1971లో పాకిస్థాన్‌ నుంచి  బంగ్లాదేశ్ విముక్తికి ఇండియా సహకరించిందని, అదే తరహాలో పాక్ నుంచి  స్వాతంత్ర్యం పొందే విషయంలోనూ సింధ్ కమ్యూనిటీకి ఇండియా  సహకరించాలని ఆయన కోరారు. ఇస్రామిక్ తీవ్రవాదంతో మైనారిటీల హక్కులను  ఇమ్రాన్ ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్  చర్యలకు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐలను ఉగ్రవాద సంస్థలుగా మోదీ,  డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాలని సింధ్ కోరారు.  

ఇక పాకిస్తాన్ మీడియా అయితే హౌదీ మోదీ కార్యక్రమంపై విషం కక్కింది. పాకిస్తాన్ మాజీ దౌత్యాధికారి అబ్దుల్ బాసిత్, అలాగే పాకిస్తాన్ మీడియాకు చెందిన కొంతమంది సీనియర్ జర్నలిస్టులు... మోదీ కార్యక్రమాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ట్రంప్...వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం భారతీయుల ఓట్ల కోసమే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారని చెప్పుకొచ్చారు. మరికొన్నిపాక్ చానెళ్లు అయితే... అమెరికాలో భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని.., ఎన్నికల సమయంలో ట్రంప్  నకు ప్రచారానికి నిధులు అవసరమని..., భారతీయుల నుంచి నిధులు రాబట్టేందేకే వచ్చారని చెప్పుకువచ్చే ప్రయత్నం చేశాయి. 


అటు మరొక పాక్ జర్నలిస్టులు అయితే ఇ్రమాన్...ప్రధాని మోదీ వ్యూహాలను పసిగట్టంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. పీవోకేలోని ముజఫరాబాద్ లో క్రికెటర్లతో కలసి సభ నిర్వహించారని..., వారేం చేస్తారని, అసలే సంకట స్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి సభలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అయితే సగటు పాకిస్తానీలు సైతం...ఇప్పుడు ఇమ్రాన్ పాలన చూసి తిట్టుకుంటున్నారు. తమ దేశ ప్రధాని కంటే... భారత పీఎం మోదీనే బెస్ట్ అంటున్నారు. తన దేశం కోసం ఆయన నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని చెబుతున్నారు. పాకిస్తాన్ లోని బెలూచ్, సింధూ, పీవోకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలన భారత్ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువచ్చింది. అమెరికాలో నివసించే సింధ్, బెలూచ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం ఇప్పుడు భారత్ కు మద్దతు కోరుతున్నారు. వీరు పాకిస్తాన్ ప్రధాని ప్రసంగించే సమయంలో సమితి కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్దమవుతున్నారని సమాచారం.