Wednesday, October 16, 2019
Follow Us on :

మన స్వాతంత్య్ర దినోత్సవం నాడు సైన్యం సహనానికి పరీక్ష పెట్టిన పాకిస్థాన్

By BhaaratToday | Published On Aug 15th, 2019

భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు పాకిస్థాన్ భారత సైన్యానికి పాకిస్థాన్ పరీక్ష పెట్టింది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని  ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్ సరిహద్దులో కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలోని కేజీ (కృష్ణా ఘాటీ) సెక్టార్ లో పాక్ రేంజర్లు భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత బలగాలు దీటుగా బదులిచ్చాయి. 

భారత సైన్యం దృష్టి మరల్చి తీవ్రవాదులను భారత్ లోకి పంపించడానికి పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇలా కాల్పుల విరమణకు తూట్లు పొడిచి ఉగ్రవాదుల్ని మన దేశంలోకి చోరబడించేందుకు యత్నించింది. పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతూ.. భారత సైన్యం దృష్టి మరల్చే యత్నం చేసింది. ఉగ్రవాదులను పంపి భారత్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్లాన్ వేసినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రవాదులు పొంచి ఉన్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా తీవ్రవాదులను భారత్ లోకి చొచ్చుకుపోయేలా పాకిస్థాన్ ప్లాన్ వేసింది.