Saturday, October 19, 2019
Follow Us on :

రాహుల్ గాంధీ మాటలకు.. పాకిస్థాన్ మంత్రి ఇచ్చిన రిప్లై ఇదే..!

By BhaaratToday | Published On Aug 28th, 2019

ఆర్టికల్ 370ని రద్దు చేసాక పాకిస్థాన్ భారత్ మీద అక్కసు వెళ్లగక్కుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం పాక్ రాజకీయనాయకులకు నచ్చడం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తోంది పాకిస్థానేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావులేదని చెప్పారు. కాశ్మీర్ లో హింస ఉందనే విషయాన్ని ఒప్పుకోవాలని.. అందుకు పాకిస్థానే కారణమని రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని.. పాకిస్థాన్ చర్యలు కూడా అలాగే ఉంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. తీవ్రవాదులకు ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాక్ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు . ఎన్నో విషయాలలో ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని, అయితే ఒక్క విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని అన్నారు.

దీంతో చేసేదేమీ లేక రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు ఆ దేశ నాయకులు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ తప్పుబట్టారు. రాహుల్ రాజకీయాలు అమోమయంగా ఉన్నాయని చెప్పారు. వాస్తవాలను దగ్గరగా ఉండాలని రాహుల్ కు సూచించారు. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూలా నిటారుగా నిలబడాలని సూచన చేశారు.