Tuesday, October 15, 2019
Follow Us on :

చాక్లెట్ సైజులో అణుబాంబులు ఉన్నాయంటూ రెచ్చిపోయిన పాక్ మంత్రి..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాకిస్థాన్ కు ఏ మాత్రం మింగుడు పడలేదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ "గుర్తుంచుకోండి, ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే. అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉంది"  అంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగని ఇమ్రాన్ ఖాన్ అగ్రరాజ్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, పాకిస్థాన్ ఎంత దూరమైనా వెళుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలకు ఇప్పుడు ఆయన మంత్రులు కూడా వత్తాసు పలుకుతున్నారు. వారిలో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ కూడా ఒకరు. 

షేక్ రషీద్ అహ్మద్ మరోసారి మాటలతో రెచ్చిపోయాడు. తమ వద్ద 125 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువైన, చాక్లెట్ సైజులో ఉన్న అణుబాంబులు కూడా ఉన్నాయని తెలిపారు. లక్షిత ప్రదేశాలను అవి ధ్వంసం చేయగలవని చెప్పారు. ఇవి వ్యూహాత్మక అణుబాంబులని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడే భారత్ తో పాకిస్థాన్ కు సంబంధాలు తెగిపోయాయని ఆయన అన్నారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్న షేక్ రషీద్ కొద్దిరోజుల క్రితం ఇస్లామాబాద్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కాళ్ల వద్ద ఉన్న వైర్లు తాకడంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. షాక్ కొట్టాడంతో ఒక్కసారిగా భయపడిపోయిన షేక్ రషీద్ ఈ సమావేశాన్ని మోదీ అడ్డుకోలేరని అన్నాడు.