Tuesday, October 15, 2019
Follow Us on :

మోదీని విమర్శించడం మొదలుపెట్టిన పాక్ మినిస్టర్.. ఇంతలో ఏమి జరిగిందంటే

By BhaaratToday | Published On Aug 30th, 2019

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాకిస్థాన్ కు ఏ మాత్రం మింగుడు పడలేదు. ప్రపంచదేశాల ముందు భారత్ ను దోషిగా చూపాలని పాకిస్థాన్ చేసిన ఏ ఒక్క ప్రయోగం కూడా ఫలించలేదు. దీంతో ఆ దేశ ప్రధాని భారత్ మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "గుర్తుంచుకోండి, ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే. అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉంది"  అంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగని ఇమ్రాన్ ఖాన్ అగ్రరాజ్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, పాకిస్థాన్ ఎంత దూరమైనా వెళుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలకు ఇప్పుడు ఆయన మంత్రులు కూడా వత్తాసు పలుకుతున్నారు. వారిలో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ కూడా ఒకరు. 


భారత ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్న షేక్ రషీద్ ఇస్లామాబాద్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కాళ్ల వద్ద ఉన్న వైర్లు తాకడంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. షాక్ కొట్టాడంతో ఒక్కసారిగా భయపడిపోయిన షేక్ రషీద్ ఈ సమావేశాన్ని మోదీ అడ్డుకోలేరని అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

కొద్ది రోజుల క్రితం కూడా షేక్ రషీద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆయన ఏకంగా ఇదే చివరి యుద్ధం అని అన్నాడు. కశ్మీర్ పై పోరాడేందుకు తమకు సరైన సమయం వచ్చిందని శపథాలు చేశాడు.