Tuesday, October 15, 2019
Follow Us on :

ఆ రాక్షసుడిని కస్టడీ నుండి సీక్రెట్ గా రిలీజ్ చేసిన పాకిస్థాన్..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! భారత్ మీద పాకిస్థాన్ ఎన్నో కుట్రలు పన్నుతోంది. భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారత్ లోని స్లీపర్ సెల్స్ ను కూడా యాక్టివేట్ చేసింది పాక్. ఇలాంటి తరుణంలో జైషే మొహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ ను పాకిస్థాన్ తమ కస్టడీ నుండి విడుదల చేసినట్లు రిపోర్ట్స్ అందాయి. భారత్ లో టెర్రరిస్టు కార్యకలాపాలకు ప్లాన్ చేయడానికి పాక్ మసూద్ అజర్ కు అన్ని సహాయసహకారాలు అందించనుంది.  

రాజస్థాన్ దగ్గర బోర్డర్ లోకి పాకిస్థాన్ పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సియాల్ కోట్-జమ్మూ-రాజస్థాన్ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ వేసినట్లు ఇప్పట్లే ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది.    

భారత్ లో ఉగ్రదాడులు ఎటువంటి సమయంలో కూడా జరగొచ్చని ఇప్పటికే ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. అజిత్ దోవల్ కూడా బోర్డర్ లో దాదాపు 230 మందికి పైగా తీవ్రవాదులు పొంచి ఉన్నారని హెచ్చరించారు. ఈ మధ్యనే పాకిస్థాన్ నుండి అందుతున్న సిగ్నల్స్ ను కూడా డీకోడ్ చేశారు. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించిన సంకేతాలను గుర్తించామని అజిత్ దోవల్ తెలిపారు. ఆపిల్ ట్రక్కులు ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళుతున్నాయి? వాటిని మీరు అడ్డుకోలేరా? లేకపోతే గాజులు పంపమంటారా? అంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు, కశ్మీర్ నుంచి పాకిస్థాన్ కు రహస్య సంకేతాలతో కూడిన సంభాషణలు నడుస్తున్నాయని అన్నారు.