Thursday, September 19, 2019
Follow Us on :

రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ కు స్పందించిన పాకిస్థాన్

By BhaaratToday | Published On Aug 17th, 2019

కొన్నేళ్లుగా రెచ్చగొడుతూ వస్తున్న పాకిస్థాన్ కు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.  పాకిస్థాన్ చేస్తున్న చర్యలను గమనిస్తూనే ఉన్నామని.. వారిని అడ్డుకోడానికి దేనికైనా భారత్ తెగిస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పరిస్థితులు దిగజారితే అణ్వాయుధాలను వాడడానికి కూడా భారత్ రెడీగా ఉందని ఆయన అన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్ లో రాజ్ నాథ్ శుక్రవారం నాడు నివాళి అర్పించారు. ఆ సైనిక కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతమని... అయితే జరుగుతున్న పరిస్థితులను బట్టి తమ పాలసీ మారే అవకాశం ఉందని తెలిపారు. భారత్ ను న్యూక్లియర్ పవర్ చేయాలనేది తమ ప్రాధాన్యతాంశమని ఇది భారత పౌరులంతా గర్వపడే విషయమన్నారు. 

దీనిపై పాకిస్థాన్ స్పందించింది. రాజ్ నాథ్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని... దురదృష్టకరమైనవని పాక్ విదేశాంగశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. అణ్వాయుధాల ప్రయోగం విషయంలో పాకిస్థాన్ ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తోందని అన్నారు.